ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP CHARGESHEET ON YCP: సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్‌‌

By

Published : May 30, 2023, 7:11 PM IST

TDP chief Chandrababu and leaders fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు 'నాలుగేళ్ల మోసకారి పాలనలో.. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలు' అనే పేరుతో ఛార్జిషీట్‌‌ను విడుదల చేశారు. అప్పట్లో ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలిస్తూ.. జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TDP chief
TDP chief

సీఎం జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ ఛార్జిషీట్‌‌ విడుదల..

TDP CHARGESHEET ON YCP: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసి (30-05-219).. నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్య నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి చేసిన అరాచాకాలు, సృష్టించిన విధ్వంసాలపై సుదీర్ఘంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, నాలుగేళ్లలో రాష్ట్రం ఏ మేరకు అభివృద్ధి చెందింది..? ఎన్ని కోట్లు అప్పులు చేశారు..? పథకాల పేరుతో ప్రజలను ఏ విధంగా మోసం చేశారు..? వంటి అంశాలపై కీలక విషయాలను వెల్లడించారు.

Tulasireddy Fire on jagan: జగన్ నాలుగేళ్ల పాలనలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్: తులసి రెడ్డి

వైఎస్సార్పీపీ విధ్వంసాన్నే పాటిస్తోంది..ముందుగా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలిస్తూ.. అప్పట్లో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ మొదట చెప్పిన విధ్వంస విధానాన్నే వైఎస్సార్పీపీ ప్రభుత్వం నిత్యం పాటిస్తోందని విమర్శించారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన ఈ విధ్వంసం.. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టిందంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన వీడియోలో.. సీఎం జగన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జగన్ నాలుగేళ్ల పాలనపై ఛార్జిషీట్‌‌ను విడుదల..నేరాలు, లూటీలు, విధ్వంసాలతోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీసర్కార్ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుందని.. తెలుగుదేశం నేతలు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. రాష్ట్రాన్ని, ప్రజలను ఏ విధంగా మోసం చేశారో తెలియజేస్తూ.. 'నాలుగేళ్ల మోసకారి పాలనలో.. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలు' అనే పేరుతో ఛార్జిషీట్‌‌ను విడుదల చేశారు.

జగన్ ఖజానా కళకళ.. జనం బతుకులు వెలవెల..నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ..''నాలుగేళ్ల క్రితం ప్రజా వేదిక కూల్చివేతతో ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ చూసిన విధ్వంసమే. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కూలాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి బూటక సంక్షేమాన్ని అందిస్తున్నారు. గతంలోని పథకాలకే మసిపూసి పేర్లు మార్చి పథకాలు ప్రవేశపెట్టారు. లోకేశ్ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకునే ఆంక్షలు విధించారు. అరాచకాలు సృష్టించారు. జగన్ ఖజానా కళకళ.. జనం బతుకులు వెలవెలయ్యే విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు'' అని ఆయన అన్నారు.

CPI Narayana Comments: 'సీఎం జగన్ రాజీనామా చేయాలి.. వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు'

సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి.. 'జగన్.. ఏమిటీ ఈ పరిపాలన' అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో అన్నీ నేరాలే, ఘోరాలే అని దుయ్యబట్టారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏం మేలు చేశారో..? చెప్పండి అని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ నాలుగేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ తరుపున తాము ఛార్జీషీట్ వేశామన్నారు. ప్రతి రాజకీయ నాయకుడికి నైతిక విలువలు ఉండాలన్న ఆయన.. వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ.. సీఎం జగన్ పేరును ప్రస్తావించిన రోజే ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాల్సి ఉండేదని, నైతిక విలువలు లేవు కాబట్టే జగన్ సీఎం పదవికీ రాజీనామా చేయలేదని వ్యాఖ్యానించారు.

జగనే..అత్యంత ధనిక సీఎం.. చివరగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమ మాట్లాడుతూ.. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి ఆస్తులు ఏపీ సీఎం జగన్‌కుఉన్నాయని పేర్కొన్నారు. అత్యంత ధనిక సీఎంగా జగన్ రెడ్డి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి అత్యంత ధనికుడుగా ఎదిగితే.. పేదవాళ్లు అత్యంత పేదవాళ్ల స్థాయికి చేరుకున్నారన్నారు. నేడు రాష్ట్రంలో రెండు వేల నోటు కనపడకుండా పోవడానికి సీఎం జగన్ రెడ్డే కారణమని ఆయన ఆరోపించారు.

TDP Vs Tammineni Sitaram: తమ్మినేనిపై టీడీపీ ఫైర్​.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details