ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Umesh Varun 3rd rank in TS EAMCET తెలంగాణ ఎంసెట్​లో సత్తా చాటిన నందిగామ విద్యార్థి

By

Published : May 25, 2023, 7:36 PM IST

EAMCET Third Ranker Umesh Varun: తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ విద్యార్థి చల్లా ఉమేష్ వరుణ్‌.. మూడో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. ఉమేష్ వరుణ్ చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Umesh Varun
Umesh Varun

EAMCET Third Ranker Umesh Varun: ఈరోజు ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్​ జిల్లా నందిగామ విద్యార్థి చల్లా ఉమేష్ వరుణ్​ సత్తా చాటాడు. నందిగామకు చెందిన చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి కుమారుడు ఉమేష్ వరుణ్ తెలంగాణ ఎంసెట్​లో మూడో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్న ఉమేష్​కు తెలంగాణ ఎంసెట్లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆరో తరగతి నుంచే గుంటూరు భాష్యం స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. అనంతరం భాష్యం కళాశాలలోనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో 983 మార్కులు సాధించాడు. ఐఐటీ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ క్యాటగిరిలో 263 ర్యాంకు కూడా సాధించాడు. బిట్స్ పిలాని నిర్వహించిన పరీక్షలో 360 మార్కులు గాను 328 మార్కులు సాధించి సత్తా చాటాడు. ప్రస్తుతం గుంటూరు భాష్యం కళాశాలలో ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.

"చాలా గొప్పగా ఫీల్​ అవుతున్నాం. తెలంగాణ ఎంసెట్​లో ఆంధ్రప్రదేశ్​కు చెందిన మా అబ్బాయికి మూడో ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి అన్నింటిలో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంటర్​లో 983 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్​ ఓపెన్​లో 263 ర్యాంకు వచ్చింది. బిట్స్​లో 360 మార్కులకు 328 సాధించాడు. ఆరో తరగతి నుంచి ఇంటర్​ వరకు కూడా భాష్యం విద్యాసంస్థల్లోనే చదివాడు. మంచి ఐఐటీలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకు అనుగుణంగానే సాధన చేస్తున్నాడు"-చల్లా విశ్వేశ్వరరావు, ఉమేష్‌ వరుణ్‌ తండ్రి

ఉమేష్​కు ర్యాంకు రావడంపై తల్లిదండ్రుల హర్షం: తెలంగాణ ఎంసెట్లో ఉమేష్ వరుణ్​కు మూడో ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు ప్రకటించంగానే ఇంట్లో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఉమేష్​ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడని అతని తల్లిదండ్రులు తెలిపారు. ఐఐటీ అడ్వాన్స్​లో మంచి ర్యాంకు సాధించి దేశంలోనే పేరుగాంచిన ఐఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఉన్నాడని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే సాధన చేస్తున్నాడని తెలిపారు.

"టాప్​ ఐఐటీలో సీటు సాధించాలని మా అబ్బాయి కోరిక. అలాగే తెలంగాణ ఎంసెట్​లో మూడో ర్యాంకు సాధించినందుకు మాకు గర్వంగా ఉంది. మా అబ్బాయి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో చురుగ్గా పాల్గొనేవాడు. మా అబ్బాయి అనుకున్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాము"-దేవకీ దేవి, ఉమేష్‌ వరుణ్‌ తల్లి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details