ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Employees Union: ఉద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వానికి నోటిస్.. ఉద్యమ కార్యచరణ ప్రకటన

By

Published : May 5, 2023, 8:11 PM IST

Updated : May 6, 2023, 9:04 AM IST

AP Employees Union Leaders gave to notices Government: ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారించే వరకూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే నేడు ఉద్యమ కార్యచరణను ఆయన ప్రకటించారు. అంతేకాదు, ఉద్యోగులు చేపట్టబోయే ఆందోళనలపై ప్రభుత్వానికి నోటీసులు కూడా అందజేశారు.

Employees Union
Employees Union

AP Employees Union Leaders gave to notices Government: రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు నేడు నోటీసులిచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 31 వరకు చేపట్టబోయే ఆందోళనలపై సచివాలయంలో ప్రభుత్వానికి నోటీసులిచ్చినట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలు, వేతనాల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టానున్నామని వివరాలను వెల్లడించారు.

ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తున్నాం.. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ..''మే 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 31 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నాం. ఈరోజు ప్రభుత్వ సచివాలయంలో ఆందోళనలకు సంబంధించిన నోటీసును కూడా ఇచ్చాం. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు, వేతనాల అంశంపై ఈ ఆందోళనలు జరగనున్నాయి. జీపీఎఫ్ విత్‌డ్రా ద్వారా ప్రభుత్వం నేరానికి పాల్పడింది. మా డిమాండ్లు నెరవేర్చాలని అడిగితే, ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమం చేపడతాం. ఉద్యమ కార్యచరణను ఈరోజే ప్రకటిస్తున్నాం.. సెప్టెంబర్‌ 1న సీపీఎస్ బ్లాక్ డే నిర్వహించాం. అక్టోబర్‌ 2న గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహ ప్రదర్శన చేపడతాం. అక్టోబర్‌ 31న బహిరంగ సభను నిర్వహిస్తాం. ఆ తర్వాత నిరవధిక సమ్మె చేపడతాం.'' అని సూర్య నారాయణ వివరాలను వెల్లడించారు.

అక్టోబరు 31న చలో విజయవాడ.. ఇటీవలే పలు మీడియా సమావేశాల్లో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అతి త్వరలోనే ఉద్యమానికి సిద్ధం కాబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క అంశం మీద నిర్దిష్టమైన పరిష్కారం చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మే 22న కార్యచరణ ప్రారంభమై.. అక్టోబరు 31 వరకు వివిధ దశల్లో ఆందోళన చేపట్టి.. అక్టోబరు 31వ తేదీన చలో విజయవాడకు పిలుపునిస్తామన్నారు. ఆ తర్వాత నిరవధిక సమ్మెను చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సెప్టెంబర్‌ 1వ తేదీన సీపీఎస్ బ్లాక్ డే.. ఆ మాట ప్రకారమే.. ఈరోజు సాధారణ పరిపాలన శాఖ అధికారి పోలా భాస్కర్​రెడ్డికి ఆందోళనకు సంబంధించిన నోటీసులను అందజేశారు. అనంతరం మే 22వ తేదీ నుంచి తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలను ప్రారంభిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్‌ 1వ తేదీన సీపీఎస్ బ్లాక్ డే నిర్వహించామన్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాల వద్ద సత్యాగ్రహ ప్రదర్శన చేపడతామన్నారు. ఉద్యమం చివరి రోజైన అక్టోబర్‌ 31న విజయవాడలో బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.

ఇవీ చదవండి

Last Updated : May 6, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details