ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాపు రిజర్వేషన్లపై జనవరి 2న "చలో పాలకొల్లు": కాపు సంక్షేమ సేన

By

Published : Dec 30, 2022, 9:50 AM IST

RESERVATIONS FOR KAPU : కాపులకు 5% రిజర్వేషన్‌ కల్పించే విషయంలో రేపటిలోపు స్పష్టత ఇవ్వాలని కాపు సంక్షేమ సేన నాయకులు డిమాండ్​ చేశారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరి రామజోగయ్య పిలుపు నిచ్చిన "చలో పాలకొల్లు" కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

RESERVATIONS FOR KAPU
RESERVATIONS FOR KAPU

KAPU RESERVATIONS : గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని.. కాపు సంక్షేమ సేన అధికార ప్రతినిధి కృష్ణాంజనేయులు డిమాండ్‌ చేశారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరి రామజోగయ్య పిలుపు నిచ్చిన "చలో పాలకొల్లు" కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు. రేపటి లోపు రాష్ట్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరి తెలిపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో జనవరి 2న చలో పాలకొల్లు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేస్తామని హెచ్చరించారు.

కాపు రిజర్వేషన్లపై స్పందించకుంటే జనవరి 2న "చలో పాలకొల్లు"

ABOUT THE AUTHOR

...view details