Dussehra Sharan Navaratri Celebrations Ended at Indrakeeladri :ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శోభకృత్ నామ సంవత్సరంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిర్వహించిన దసరా మహోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శ్రీచక్ర అధిష్టాన దేవత జగజ్జనని బాలత్రిపురసుందరీ దేవి అలంకరణతో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాల్లో తొలిసారి మహాచండీదేవి అలంకరణ తీసుకురాగా చివరి రోజున మహిషాసురమర్దిని రాజరాజేశ్వరిదేవి అలంకరణతో తొమ్మిది రోజుల్లో పది అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు.
చిరునవ్వులు చిందిస్తూ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శాంతస్వరూపిణిగా రాజరాజేశ్వరిదేవి అలంకరణ భక్తుల రద్దీ దృష్ట్యా మరో రోజు కొనసాగించాలని దేవస్థానం నిర్ణయించింది. భవానీ మాలధారులు, సాధారణ భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. బుధవారం వరకు ఈ రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Indrakeeladri EO on Teppotsavam Celebrations: ఇంద్రకీలాద్రిపై ముగింపు దశకు చేరుకున్న దసరా ఉత్సవాలు.. దుర్గామల్లేశ్వర స్వామి జలవిహారానికి పూర్తైన ఏర్పాట్లు..
Vijayawada Kanaka Durgamma Temple Dasara Celebrations Closed :ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆలయ ఈవోను అనూహ్యంగా మార్చేయడంతో భక్తుల సౌకర్యాల కల్పన పనుల్లో కొంత ఆలస్యానికి కారణమైంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ప్రత్యక్షంగా వీటి పర్యవేక్షణ బాధ్యతలు తలకెత్తుకున్నా ఉత్సవాల ప్రారంభం వరకు పనులు సాగుతూనే వచ్చాయి. దసరా ఉత్సవాల సమన్వయ సమావేశాల మొదలు.. చివరి వరకూ దుర్గ గుడి పాలక మండలిని పరిమితంగానే భాగస్వాములు చేయడంతో ఛైర్మన్ మొదలు సభ్యుల వరకు అందరినీ నిరాశ పరిచింది.
Indrakeeladri Teppotsavam Celebrations :చివరి రోజు తెప్పోత్సవంలోనూ హంసవాహనంపై విహారానికి పాలకమండలికి అనుమతి లేదని- ప్రజాప్రతినిధులు- అధికారులు, ప్రోటోకాల్ పరిధిలోని వారికి మరో పంటును అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొనడం అసంతృప్తికి గురి చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు తెప్పోత్సవానికి దూరం కాగా.. పాలకమండలి ఛైర్మన్, సభ్యులు సైతం కాసేపు దుర్గాఘాట్‌లోని వీఐపీలకు కేటాయించిన ప్రదేశంలో ఉండి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. హంసవాహనంపై ఆదిదంపతుల నౌకావిహారం మూడుసార్లు సాగిన క్రమంలో తొలిరౌండ్‌కే ఘాట్‌లో వీఐపీలు అంతా వెనుదిరిగారు. సామాన్యులను ఘాట్‌లోకి అనుమతించకపోవడంతో బ్యారేజీ, పైవంతెన నుంచి వీక్షించాల్సి వచ్చింది.