ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యాప్​తో టోపి: రూ.800 కట్టి చేరండి! మరో ముగ్గురిని చేర్పించండి.. తరువాత..!

By

Published : Apr 8, 2023, 9:32 AM IST

IPG App Cheating: వందలు పెట్టుబడిగా పెడితే.. వేలల్లో డబ్బు ఇస్తామని నమ్మించేవారుంటారు.. నమ్మేవారు ఉంటారు.. తరువాత డబ్బులు ఊరికే రావు అన్న తత్వం బోదపడే సరికి క్షవరం అయిపోతుంది. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని వెలుగలోకి వచ్చినా.. మోసం చేసేవారికి, ఎప్పుడూ కొత్త దారులు ఉంటాయి. తాజాగా గుంటూరులో యాప్ పేరుతో జరిగిన చీటింగ్​లో వేల మంది మోసపోయారు.

IPG App cheating
IPG App cheating

IPG App cheating : రకరకకాల స్కీములు, పెట్టుబడులపై ఆకర్షణీయ ఆదాయం అంటూ ఊదరగొట్టి భారీ మోసానికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో వెలుగు చూసింది. 'ఐపీజీ' యాప్ పేరుతో విస్తృతంగా ప్రచారం చేసి కొన్ని వేల మందిని ఆ గ్రూపులో సభ్యులుగా చేర్చుకుని ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. ప్రస్తుతం విజయవాడలోని చిట్టినగర్​కు చెందిన ఒక వ్యక్తి తాను మోసపోయినట్లు పోలీసులను ఆశ్రయించగా.. విజయవాడ పక్కనే ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇదే యాప్ పేరుతో జరిగిన మోసాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చిట్టినగర్​కు చెందిన ఓ వ్యక్తి తనకు ఎక్కువ ఆదాయం రావడంతో ఆకర్షితుడై మరికొంత మందిని చేర్చారు. ఒక్కసారిగా యాప్ నిలిచిపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీరు చేరండి.. మరికొంత మందిని చేర్చండంటూ.. ఈ స్కీమ్​లో చేరే వారు ముందుగా 'ఐపీజీ' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో అప్పటికే సభ్యుడైన వ్యక్తి పర్యవేక్షణలో 800 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలి. ఇలా చేరిన వ్యక్తి మరి కొంత మందిని చేర్చాలి. ఇలా ఎంత మందిని చేరిస్తే అంత ఆదాయం. సభ్యులను ఆకర్షించేందుకు.. కొత్తగా చేరి మరికొంత మందిని చేర్చేవారికి ఆకర్షణీయమైన కమీషన్ చెల్లించేవారు. ఇలా కొంత మందికి మొదట్లోనే రూ. 1300 నుంచి రూ. 2 వేల వరకు కమీషన్ రావడంతో వారు కొత్త సభ్యులను చేర్చేందుకు ఉత్సాహం చూపారు.

ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. సభ్యులుగా చేరుతున్న వారందరిని కలిపి ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసేవారు. ఒక్కొక్కరు ఎంత మందిని చేరుస్తున్నారు? వారికి ఎంత కమీషన్ వస్తుంది? అదే విధంగా పెట్టుబడులు పెట్టిన వారికి ఎలా ఆదాయం ఇస్తున్నారో గ్రూపులో కని పించేదని యాప్​లో చేరిన వారు చెబుతున్నారు. చాలా మంది వాట్సాప్​లో కనిపిస్తున్న ఆదాయాన్ని చూసి ఆకర్షితులై మరికొంత మందిని అందులో చేర్చారు. ఇలా గొలుసుకట్టుగా వేలాది మంది చేరిపోయారు.

గుంటూరు జిల్లాలో ఇదే తరహా మోసం.. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇదే తరహా మోసం బుట్టబయలైంది. ఇక్కడ రూ.800 నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారు. ఒకరు 800 రూపాయలు కట్టి తన కింద మరో 30 మందిని చేర్చారు. ఇలా చేరిన వారు వారి కింద మరికొంత మందిని చేర్చారు. చెల్లింపులు ఎక్కువగా చేయాల్సిన స్టేజీ రావడంతో గొలుసుకట్టుగా చేరిన వారికి కొద్ది రోజులుగా కమీషన్ ఇవ్వకుండా ఆపేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిందంటూ సాకు చెప్పి ఒక్కసారిగా యాప్​ను నిలిపేశారు. తెలంగాణ రాజధానిలో ఇటీవల ఇదే తరహాలో.. ఇదే యాప్ ద్వారా మోసపోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా విజయవాడలో ఇదే తరహా మోసం బయటపడడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details