ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అవసరమైతే మరోసారి గవర్నర్​ను కలుస్తాం: సూర్యనారాయణ

By

Published : Feb 2, 2023, 9:49 PM IST

APGEA Demands: ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్​పై అన్ని పార్టీలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు ఇస్తామన్నారు. అవసరమైతే మరోసారి గవర్నర్​ను కూడా కలుస్తామన్నారు.

AP Govt Employees Union
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం

APGEA Demands: మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల బకాయిలు.. చెల్లింపులు.. చట్టబద్దత అనే అంశంపై విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చా వేదికలో 13 తీర్మానాలను ఆమోదించారు. జీతాల చెల్లింపుల విషయంలో చట్టం చేయాలనే డిమాండ్​పై అన్ని పార్టీలకు వినతి పత్రాలు ఇస్తామని సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చట్టం చేయమని అడిగితే ఎందుకు ఇతర సంఘాల నేతలు వింతగా చూస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

మహారాష్ట్రలో ఉద్యోగుల బదిలీలు, ఆర్ధిక ప్రయోజనాలకు సంబంధించి చట్టం ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు ఇస్తామన్నారు. జీతాల చెల్లింపుల చట్టబద్ధతపై అవసరమైతే మరోసారి గవర్నర్​ను కూడా కలుస్తామని పేర్కొన్నారు.

చర్చలో మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details