ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. నీట మునిగిన బస్తీలు

By

Published : Sep 26, 2020, 9:11 PM IST

కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకోగా.. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. నీట మునిగిన బస్తీలు
భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. నీట మునిగిన బస్తీలు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మహానంది..

మహానంది మండలంలో పాలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా మహానంది వ్యవసాయ కళాశాల, ఉద్యాన పరిశోధనా స్థలం, పశుపరిశోధనా స్థలం, గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలోని చెంచుకాలనీలోకి వరద నీరు వచ్చింది. బండి ఆత్మకూరు మండలంలోని నారాయణపురం, చిన్నదేవులపురం, లింగాపురం, రామాపురం, బీసీ పాలెం గ్రామాలను వరద చుట్టుముట్టింది.

కోవెలకుంట్ల..

కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు ఎస్సీ కాలనీలోకి వర్షపు నీరు చేరింది. రుద్రవరం, గడివేముల మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

బనగానపల్లి..

బనగానపల్లి మండలం టంగుటూరు వద్ద అలుగు వాగు పొంగి ప్రవహిస్తోంది. పాములపాడు మండలంలోని మద్దూరు- కృష్ణానగర్ గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలోకి నీళ్లు చేరాయి. సంజామల మండలంలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల మండలంలోని పెద్దకొట్టాలలోకి నీరు చేరింది. హాలహర్వి మండలం చింతకుంట వద్ద కట్ర వంక వాగు పొంగుతున్న కారణంగా.. పంట పొలాలన్నీ నీట మునిగాయి.

సహాయక చర్యలు చేపట్టిండి: స్థానికులు

వరద నీటిలోనే కాలనీలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

దళితులపై దాడులకు వ్యతిరేకంగా జై భీమ్​ యాక్సెస్​ జస్టిస్​ పోరాటం

ABOUT THE AUTHOR

...view details