ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యంత్రంలో ఇరుక్కున్న చీర... రెండుగా చీలిన శరీరం

By

Published : Oct 23, 2020, 4:15 PM IST

సిమెంట్ పైపుల పరిశ్రమలో ఘోర ప్రమాదం సంభవించిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటు చేసుకుంది. పరిశ్రమ యజమానురాలు పద్మావతి శరీరం రెండుగా విడిపోయి తీవ్ర దుస్థితిలో మరణించింది.

ఘోర ప్రమాదం: శరీరం విడిపోయి మరణించిన పరిశ్రమ యజమానురాలు
ఘోర ప్రమాదం: శరీరం విడిపోయి మరణించిన పరిశ్రమ యజమానురాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో సిమెంట్ పైపుల పరిశ్రమలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దారుణ ఘటనలో పరిశ్రమ యజమానురాలు పద్మావతి శరీరం రెండుగా విడిపోయింది. తల నుంచి నడుము వరకు ఒక భాగంగా.. నడుము నుంచి మిగతా శరీరం మరొక భాగంగా చీలిపోయి మరణించింది.

సిరుగప్ప చెక్ పోస్ట్ వద్ద..

పట్టణంలోని శివారు సిరుగుప్ప చెక్ పోస్ట్ దగ్గర తమ సొంత సిమెంట్ పైపుల తయారీ పరిశ్రమలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైపులు తయారీ యంత్రంలో చీర కొంగు చుట్టుకుని తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ క్రమంలో బాధితురాలని ఆస్పత్రికి తరలించే యత్నంలోనే చనిపోయిందని భర్త నాగేశ్ పోలీసులకు తెలిపారు.

హృదయవిదారకంగా..

మృతురాలి తల్లి హృదయవిదారకంగా కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి : క్వారీ గుంతల్లో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details