SRISAILAM RESERVOIR: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,08,874 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 37,630 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. గడిచిన మూడు రోజుల్లో 6 టీఎంసీల వరద నీరు జలాశయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 831.90 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 51.4304 టీఎంసీలుగా నమోదైంది. కృష్ణా బేసిన్ పరిధిలోని ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలకు వరద వస్తుండడంతో దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.
ఇదీ చదవండి: