ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నంద్యాలలో విద్యార్థులకు అస్వస్థతపై.. మంత్రి సురేశ్‌ ఆరా

By

Published : Mar 11, 2022, 5:18 PM IST

నంద్యాలలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి సురేశ్‌ ఆరా తీశారు. ఈ మేరకు కర్నూలు డీఈవోతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి.. అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరేవరకు దగ్గరుండి చూడాలని ఆదేశించారు.

Education Minister Suresh
Education Minister Suresh

కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తరువాత వాంతులు చేసుకున్నారు. కారణాలు తెలుసుకోవాలని, ఆహారపదార్థాలు పరీక్షించాలని మంత్రి ఆదేశించారు. పిల్లలందరికీ పరీక్షలు చేసి అస్వస్థతకు గురైన వారికి వైద్యం అందించాలని సూచించారు. అందరూ సురక్షితంగా ఇళ్లకు వెళ్లేవరకూ విద్యాశాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి సురేష్ ఆదేశించారు.

43 మంది విద్యార్థులకు అస్వస్థత..
కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్‌లో 43 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని నంద్యాల సూపరింటెండెంట్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి:నంద్యాలలో 43 మంది విద్యార్థులకు అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details