ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచలింగాల చెక్​పోస్టు వద్ద భారీగా వెండి పట్టివేత

By

Published : Aug 24, 2021, 9:38 AM IST

కర్నూలు జిల్లా సరిహద్దులోని పంచలింగాల చెక్​పోస్టు వద్ద అధికారులు భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వెండి రూ.9 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. సరైన పత్రాలు లేకుండా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్​కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

silver seized
వెండి పట్టివేత

కర్నూలు జిల్లా సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు భారీగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలు చేపట్టిన అధికారులు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 14 కేజీల వెండిని గుర్తించారు.

ఎలాంటి ఆధారాలు లేకపోవటంపై వెండిని స్వాధీనం చేసుకున్నారు. వెండిని తరలిస్తున్న హిమాచల్ ప్రదేశ్​కు చెందిన విక్రమ్, అర్జిత్​సింగ్​లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వెండి విలువు రూ.9 లక్షలు విలువ చేస్తుందని అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details