ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎమ్మెల్యే వంశీ సభలో వైకాపా శ్రేణుల బాహాబాహీ

By

Published : Dec 19, 2020, 12:49 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లిలో వైకాపా నేతలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే వంశీ హాజరైన కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.

YCP FIGHT
YCP FIGHT

ఎమ్మెల్యే వంశీ సభలో వైకాపా శ్రేణుల బాహాబాహీ

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. ఈ సభలోనే వైకాపా శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు ఎందుకు పెడుతున్నావంటూ వంశీ అనుచరుడైన ముప్పలనేని రవికుమార్​ను గన్నవరం వ్యవసాయ సలహా మండలి కమిటీ అధ్యక్షుడు కసరనేని గోపాలరావు ప్రశ్నించటంతో వివాదం చెలరేగింది. ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సర్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details