ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి

By

Published : Jul 30, 2021, 6:23 PM IST

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదం కృష్ణా జిల్లా కంచికచర్ల మండంలో జరిగింది.

two died in road accident in krishna district
two died in road accident in krishna district

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు క్రాస్ రోడ్ సమీపంలో పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు చందర్లపాడు మండలం వనపర్తి రాజేష్​గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను కంచికచర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details