ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమ్మఒడి కోసమే పుట్టారా.. విద్యార్థిపై ఉపాధ్యాయుడి దూషణ

By

Published : Jan 23, 2020, 8:14 PM IST

Updated : Jan 31, 2020, 8:03 AM IST

మీ అమ్మానాన్న ఏం చేస్తారు. మీరు అసలు ఈ పథకానికి అర్హులే కారు. ప్రభుత్వ సొమ్ము కాజేయటానికే పుట్టారా..? అంటూ ఓ ఉపాధ్యాయుడు ఎస్సీ విద్యార్థిని చితకబాదాడు. కొడితే కొట్టించుకోవాలంటూ... సినిమా డైలాగులు చెప్పిమరీ కొట్టాడు..!

The teacher who hit the student for taking ammavodi scheem money in nezuveedu at krishna
అమ్మఒడి తెచ్చిన చిక్కు.. విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

విద్యార్థిపై ఉపాధ్యాయుడి పరుష పదజాలం

ప్రభుత్వ పథకాలు అప్పనంగా అనుభవించేందుకు పుట్టారా..? అంటూ ఓ ఎస్సీ విద్యార్థిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని ఎస్.ఆర్.ఆర్ బాలుర ఉన్నత పాఠశాల​లో జరిగింది. లాగు సిద్ధార్థ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం ద్వారా సిద్ధార్థ తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15000 జమయ్యాయి.

ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు సిద్ధార్థను పిలిచాడు. మీ అమ్మానాన్న ఏంచేస్తారని ప్రశ్నించాడు. ప్రభుత్వం డబ్బు కాజేసేందుకే పుట్టారా..? అంటూ... సిద్ధార్థ తలను గోడకేసి కొట్టాడు. ఎందుకు కొడుతున్నారని విద్యార్థి ప్రశ్నిస్తే... కొడితే కొట్టించుకోవాలని సినిమా డైలాగ్ చెప్పాడని విద్యార్థి వాపోయాడు. ఉపాధ్యాయుడి చర్యపై సిద్ధార్థ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ తండ్రి శ్రీనివాసరావు పాఠశాల అభివృద్ధి కమిటీ వైస్​ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

Last Updated : Jan 31, 2020, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details