ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పదో తరగతిలో పేపర్ల వారీగా గ్రేడ్లు..మార్కుల జాబితాల్లో మార్పు

By

Published : Oct 16, 2019, 10:04 AM IST

పదో తరగతి మార్కుల జాబితాలో కీలక మార్పులు చేసింది. మెమోలో పేపర్లు, సబ్జెక్టుల వారీగానూ గ్రేడ్లు ఇచ్చేవిధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

key changes in ssc marks memo

పదో తరగతి మార్కుల జాబితాలో(మెమో) ఇకనుంచి పేపర్ల వారీగానూ, సబ్జెక్టుల వారీగానూ గ్రేడ్లు ఇస్తారు. పదో తరగతిలో హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకూ రెండేసి పేపర్లుంటాయి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతిలో తెచ్చే సంస్కరణలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం ఏదైనా ఒక పేపరులో ఉత్తీర్ణత సాధించలేనప్పుడు పేపర్ల వారీగా ఇచ్చే గ్రేడ్ల అనుత్తీర్ణత గ్రేడ్లు వచ్చినా.. సబ్జెక్టుతో కలిపినపుడు ఉత్తీర్ణత గ్రేడు ఇస్తారు. జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక-2019. ,సిఫార్సులు, నూతన విద్యా విధానం -2019, పరీక్షల్లో సంస్కరణలకు పాఠాశాల విద్యాశాఖ కమిషనర్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు. పదోతరగతి పరీక్షల్లో మార్పులు తేవాలన్న ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

  • ప్రశ్నాపత్రం 4 సెకన్లుగా ఉంటుంది.
  • అబ్జెక్టివ్ విధానం- ఒక్క పదంలో సమాధానం రాయాలి. ఐచ్ఛికాలుండవు.
  • సూక్ష్మ లఘుప్రశ్నలు- ఒకటి లేదా రెండు వాక్యాల్లో అన్నింటికి సమాధానాలు రాయాలి.. లఘుప్రశ్నలు- రెండు, నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఐచ్ఛికాలుండవు.
  • వ్యాసరూప ప్రశ్రలు- ఛాయిస్ ఉంటుంది. అయితే, తెలుగు పేపరు-2 లో రెండో ప్రశ్న, ఆంగ్లం పేపరు-1లో 35వ, పేపరు-2లో 28వ ప్రశ్రలకు ఛాయిస్ ఇవ్వలేదు.
  • సమాధాన పత్రం 24 పేజీలు ఉంటుంది. అదనపు పత్రాలు ఇవ్వరు.
  • ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 15 నిముషాలు అదనంగా సమయం ఉంటుంది.

మార్కుల విధానం..

సెక్షన్ ప్రశ్న విధానం ప్రశ్నల సంఖ్య ఒక్కో ప్రశ్నకు మార్కులు మొత్తం మార్కలు శాతం ప్రశ్నకు సరాసరి నిమిషాలు సెక్షన్​కు నిమిషాలు
1 అబ్జెక్టివ్ 12

1/2

6 12 1.5 18
2 సూక్ష్మ లఘు 8 1 8 16 3 24
3 లఘు సమాధానాలు 8 2 16 32 6 48
4

వ్యాసరూప

సమాధానాలు

5 4 20 40 12 60 మొత్తం 33 50 100 150(2.30 గం.లు)

ఇదీచూడండి.'అపరిష్కృత గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయండి'

ABOUT THE AUTHOR

...view details