ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఎంపీ నందిగం సురేష్​పై కేసు నమోదు చేయాలి'

By

Published : May 23, 2020, 7:17 PM IST

ఎంపీ నందిగం సురేష్ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఖండించారు. ఎంపీపై కేసు రిజిస్టర్ చేయాలని డిమాండ్‌ చేశారు.

tdp varla
tdp varla

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై ఇతర రాష్ట్రాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంపీ సురేష్ న్యాయ స్థానాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు.

హైకోర్టు మేనేజబుల్ అని సురేష్ ఎలా చెప్తారన్న వర్ల.. ఇది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని కించపరుస్తూ.. క్షమించరాని నేరం చేసిన ఎంపీ సురేష్​పై కంటెమ్ట్ ఆఫ్ ది కోర్టు కేసు రిజిస్టర్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ ‌చేశారు.

ABOUT THE AUTHOR

...view details