ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో అన్న మృతి.. చూసేందుకు వెళ్తున్న తమ్ముడు కూడా!

By

Published : Jan 8, 2022, 1:36 PM IST

ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అన్న మృతదేహాన్ని చూసేందుకు వెళ్తున్న.. తమ్ముడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

ROAD ACCIDENT
ROAD ACCIDENT

ROAD ACCIDENT: కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం వద్ద లారీ ఢీకొనడంతో గొల్లమందలకు చెందిన తేళ్లూరి బాబు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తిరువూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తమ్ముడు తేళ్లూరి రామారావు.. అన్న మృతదేహాన్ని చూసేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

జీల్లకుంట సమీపంలోకి రాగానే.. రామారావు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని తిరువూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొన్ని గంటల వ్యవధిలోనే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అన్నదమ్ములు చనిపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

ABOUT THE AUTHOR

...view details