ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్​ ప్రారంభోత్సవం.. దూరంగా వైసీపీ నేతలు

By

Published : Jan 30, 2023, 8:40 PM IST

New railway station at Machilipatnam: మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్​ను రైల్వే అధికారులు ప్రారంభించారు. స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే దూరంగా ఉన్నారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం టీడీపీ కృషి వల్లే సాధ్యమైందని టీడీపీ నేతలు అంటున్నారు. స్టేషన్ నిర్మాణానికి వైసీపీ నేతల పాత్ర లేనందునే వారు ప్రారంభోత్సవానికి రాలేదని విమర్శిస్తున్నారు.

New railway station at Machilipatnam
New railway station at Machilipatnam

New railway station at Machilipatnam: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నూతన రైల్వే స్టేషన్​ను రైల్వే అధికారులు ప్రారంభించారు. స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. స్టేషన్​లో కొండవీడు ఎక్స్​ప్రెస్​ను జెండా ఊపి అధికారులు రైలును ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపి బలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని దూరంగా ఉన్నారు. 342 కోట్ల రూపాయల వ్యయంతో అధికారులు రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు.

నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం తమ కృషి వల్లే సాధ్యమైందని టీడీపీ నేతలు అంటున్నారు. స్టేషన్ నిర్మాణానికి వైసీపీ నేతల పాత్ర లేనందునే వారు ప్రారంభోత్సవానికి రాలేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2014లో కోనకళ్ల నారాయణ ఎంపీగా ఉన్న సమయంలో స్టేషన్ నిర్మాణానికి నిధులు తీసుకువచ్చారని వారు గుర్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details