ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు'

By

Published : Jun 28, 2021, 1:55 PM IST

Updated : Jun 28, 2021, 9:03 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని నాని నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు.

MP keshineni nani
ఎంపీ కేశినేని నాని

మాజీ ప్రధాని, తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని పీవీ నరసింహారావు విగ్రహం వద్ద పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు ఆద్యుడైన పీవీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ..

సత్యనారాయణ పురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎంపీ కాశినేని నాని పాల్గొని.. ప్రత్యేక పూజలు చేశారు. మచిలీపట్నంలో పీవీ నరసింహారావు విగ్రహానికి తెదేపా నాయకులు ఘన నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా తెలుగువాని కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటిచెప్పిన మహామేథావి పీవీ అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

ప్రధాని పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు.. పీవీ
ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించి చరిత్రలో నిలిచిన తెలుగుబిడ్డ పీవీ నరసింహరావు అని మాజీ ఉపసభాపతి డాక్టర్​ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో నిర్వహించిన పీవీ శత జయంతి మహోత్సవంలో పాల్గొన్న ఆయన.. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గాంధీక్షేత్రం కమిటీ కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెదేపా కార్యాలయంలో పీపీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. పీవీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి

'దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయం'

Last Updated : Jun 28, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details