ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కేసీఆర్‌, జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం'

By

Published : Jul 30, 2019, 8:33 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌, జగన్‌మోహన్‌ రెడ్డిల మధ్య బందరు పోర్టు గురించి రహస్య ఒప్పందం జరిగిందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నంలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొల్లు రవీంద్ర

కొల్లు రవీంద్ర

బందరు పోర్టు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. బందరు పోర్టును... రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారుకు అప్పగించిందని ఆరోపించారు. ఈ విషయంపై గతనెలలో జీవోఆర్టీ-62 నెంబర్‌ ద్వారా కేసీఆర్‌, జగన్‌మోహన్‌ రెడ్డిల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పోర్టు నిర్మించాలని... లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని కొల్లు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details