ఆంధ్రప్రదేశ్

andhra pradesh

sonu sood - chandrababu: చంద్రబాబు ఐక్య కార్యాచరణకు సోనూసూద్​ ఓకే!

By

Published : Jun 12, 2021, 1:53 PM IST

Updated : Jun 12, 2021, 2:58 PM IST

"కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం ఇప్పటికీ నాకు దేశవ్యాప్తంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందుకే క్లిష్ట పరిస్థితుల్లో సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నా. తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు నాకు దగ్గరగా ఉండటం సంతోషకరం." - సోనుసూద్, ప్రముఖ బాలీవుడ్ నటుడు, సామాజిక సేవకుడు

SONUSOOD : చంద్రబాబు ఐక్య కార్యచరణకు సోనూసూద్​ ఓకే.. కలిసి పనిచేయాలని నిర్ణయం
SONUSOOD : చంద్రబాబు ఐక్య కార్యచరణకు సోనూసూద్​ ఓకే.. కలిసి పనిచేయాలని నిర్ణయం

sonu sood - chandrababu: చంద్రబాబు ఐక్య కార్యాచరణకు సోనూసూద్​ ఓకే!

దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తెదేపా అధినేత చంద్రబాబు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమావేశంలో నటుడు సోనూసూద్​తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.

సేవ చేయడం బాధ్యత: సోనుసూద్

కొవిడ్‌ సమయంలో తనకు తోచిన సాయం అందిస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ వెల్లడించారు. ఈ మేరకు విపత్కర పరిస్థితుల్లో సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి చాలా మందిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఘనత చూశా..

హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సోనూ కీర్తించారు. కొవిడ్‌పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సోనూసూద్‌కు చంద్రబాబు సూచన చేశారు. త్వరలోనే ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని కోరిన నేపథ్యంలో చంద్రబాబు సూచనను సోనుసూద్ అంగీకరించారు.

ఆంధ్రా అల్లుడినే..

ఆంధ్రా, తెలంగాణ.. తనకు రెండో ఇల్లు వంటిదని.. తన భార్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడం ఆనందకరమని అన్నారు. ఇప్పటికీ సాయం అందించాలంటూ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తనకు ఫోన్​ కాల్స్‌ వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

సేవ చేయడమే విధి..

అర్ధరాత్రి 2 గంటల సమయంలోనూ సాయం కోసం ఫోన్ కాల్స్ వచ్చేవని తెలిపిన సోనూసూద్‌ .. సమయంతో సంబంధం లేకుండా సేవ చేయడమే విధిగా భావించినట్లు స్పష్టం చేశారు. ఎవరికివారు తమ సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని.. సాయం కోరిన వారి పట్ల సేవ చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోండని ప్రజలకు, అభిమానులకు సూచించారు.

కుల, మత ప్రాంతాలతో పని లేదు..

సేవ చేసేందుకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదన్న సోనూ.. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని.. ప్రజా సేవకు స్పందించే ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలేనని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

'తగ్గిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు'

Last Updated : Jun 12, 2021, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details