ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి'

By

Published : May 12, 2020, 6:18 PM IST

రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. హైరిస్క్‌ కేటగిరీలో పాజిటివ్‌ కేసులను వెంటనే గుర్తిస్తే మరణాల రేటు ఇంకా తగ్గించవచ్చునని తెలిపారు. రికవరీ రేటు 51.49 శాతంగా ఉందని, డిశ్చార్జిల సంఖ్య పెరుగుతోందనన్నారు.

Health Ministry  Special Secretary  talked about corona details
కరోనాపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశం

కొవిడ్ యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన కరోనా నియంత్రణ చర్యలపై, కేసుల గురించి వివరాలు తెలిపారు. బయటి నుంచి వచ్చిన 10,730 నమూనాలు సేకరించి పరీక్షించగా 33 మందికి పాజిటివ్‌ వచ్చిందని అన్నారు. రికవరీ రేటు 51.49 శాతంగా ఉందని, డిశ్చార్జిల సంఖ్య పెరుగుతోందని... ఇప్పటివరకు 1056 మంది డిశ్చార్జి అయ్యారని అన్నారు. కొవిడ్‌ -19ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వ్యూహం పనిచేస్తోందని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వస్తున్న వలస కార్మికులకు పరీక్ష చేస్తుంటే... పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కర్నూలుకు చేరుకున్న కార్మికుల్లో 37 మంది పాజిటివ్ రాగా...అనంతపురం జిల్లాలోనూ పాజిటివ్ కేసులు వస్తున్నాయనన్నారు. కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు చేస్తున్నామని... చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివ్ కేసుల గుర్తింపుతో పాటు హైరిస్క్‌ కేటగిరి వారిని రక్షించుకోవాలని..ఇతర వ్యాధులు ఉన్న వృద్ధులు హైరిస్క్‌ కేటగిరీలో ఉంటారని తెలిపారు. వృద్ధులకు పరీక్షలు చేయాల్సినదిగా కలెక్టర్లను ఆదేశించామని...మరణాల శాతం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామనన్నారు.

స్విమ్స్, కర్నూలు జీజీహెచ్‌లో అత్యవసర కేసుల కోసం ప్లాస్మా సేకరిస్తున్నామని అన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అనుమతి వచ్చిందని..ప్రధానమంత్రి రాష్ట్రాలకు పలు సూచనలు చేశారని తెలిపారు. లాక్‌డౌన్ నుంచి బయటకు వచ్చే వ్యూహాలు తయారుచేస్తున్నామని అన్నారు. హైరిస్క్‌ కేటగిరీలో పాజిటివ్‌ కేసులను వెంటనే గుర్తిస్తే మరణాల రేటు ఇంకా తగ్గించవచ్చునన్నారు. పరిశ్రమలు, ఉద్యాన, వ్యవసాయం, రవాణా వంటి వాటిపై మొత్తం 6 కమిటీలు ఏర్పాటు చేశామని...ఈ నెల 15 లోగా నివేదికలు పంపాలని కేంద్రం కోరిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details