ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

By

Published : Oct 18, 2020, 11:20 PM IST

మోపిదేవిలో 108 అంబులెన్స్​కు ఫోన్ చేశారు. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని నాచుగుంటకు చెందిన పీతా రామలక్ష్మీ ఆమెను ఆవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా...మార్గ మధ్యలో ప్రసవం అయ్యింది.

Happy delivery in an ambulance in the middle of the road
మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లోని నాచుగుంటకు చెందిన పీతా రామలక్ష్మి గర్భిణి. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 కు కాల్ చేశారు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రసవం అయ్యింది. 108 సిబ్బంది.. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సిహెచ్.వెంకట నర్సయ్య ప్రసవం చేశారు. ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నాగాయలంక నుంచి ఎటిమోగ వరకు గతుకుల మయంగా ఉన్న రహదారిపై అంబులెన్స్​ను ఎంతో చాకచక్యంగా నడిపిన డ్రైవర్ బీ.దీలిప్ బాబును స్థానికులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details