ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganja Gang Murdered Muslim Young Man in Vijayawada: యువకుడిని హతమార్చిన గంజాయి గ్యాంగ్​.. వివాదాలు వద్దన్నందుకు..!

By

Published : Aug 18, 2023, 12:02 PM IST

Ganja Gang Murdered Muslim Young Man in Vijayawada: విజయవాడలో గంజాయి మూక రెచ్చిపోయింది. సెల్ ఫోన్ రిపేర్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అసాంఘిక శక్తుల చేతిలో హతమయ్యాడు. తన స్నేహితులతో వివాదాలు వద్దు అని చెప్పినందుకు రౌడీ మూక ఓ పేద ముస్లిం యువకుడ్ని పొట్టన పెట్టుకుంది. అసాంఘిక శక్తుల దుశ్చర్యతో నగర శివార్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Ganja_Gang_Murdered_Muslim
Ganja_Gang_Murdered_Muslim

Ganja Gang Murdered Muslim Young Man: యువకుడిని హతమార్చిన గంజాయి గ్యాంగ్

Ganja Gang Murdered Muslim Young Man in Vijayawada: గంజాయి, మద్యం మత్తు తలకెక్కిన రౌడీమూక ఓ పేద ముస్లిం యువకుడ్ని హతమార్చింది. తన స్నేహితులతో వివాదం వద్దు అని చెప్పినందుకు మత్తులో ఉన్న అసాంఘిక శక్తుల గుంపు రెచ్చిపోయింది. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి హతమార్చారు. రౌడీమూకల దుశ్చర్యతో నగరశివార్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. యువకుడి మృతదేహంతో తహశీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. హత్యకు ముందు పోలీసులు నిందితులను పట్టుకుని వదిలేశారని.. అప్పుడే పోలీసులు వారిని స్టేషనుకు తీసుకెళ్లుంటే హత్య జరిగి ఉండేదికాదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

Medico Student Suicide in Guntur వైద్యుడు కావల్సినోడు.. శవంగా మారాడు..! మెడికో ఆత్మహత్యకు ఫీజు పెంపు కారణమా?

Muslim Boy killed by Ganja Gang: గొడవలు ఎందుకని యువకుడు ప్రశ్నించడంతో పిచ్చెక్కిన గంజాయి మూక.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్​ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. యనమలకుదురు- తాడిగడప డొంకకరోడ్డుకు చెందిన షేక్ రఫీ బుధవారం సాయంత్రం మసీదు వద్దకు వెళ్తుండగా.. స్థానికుడైన నడకుదుటి నాగరాజుతో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషా అనే వ్యక్తులు గొడవ పడుతుండడం గమనించాడు. నాగరాజు పిలవడంతో రఫీ వారి వద్దకు వెళ్లి గొడవ వద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని సూచించాడు. ఆగ్రహించిన ఆ ముగ్గురూ రఫీని బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాధితుడు మూడురోడ్ల కూడలిలో ఉన్న తన స్నేహితుల వద్దకు రాగా అదే సమయంలో ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌ బాషా, అక్రమ్ అనే వ్యక్తి, మరో 20 మంది కలిసి రెండు ఆటోలు, ద్విచక్రవాహనాలతో అక్కడకు చేరుకొన్నారు. రఫీని కాళ్లతో తొక్కి, కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి పరారయ్యారు. రఫీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.

Man Injured in Blade Attack: భార్యాభర్తల మధ్య గొడవలు.. బావపై బావమరిది బ్లేడ్లతో దాడి

Ganja Gang Halchal in Vijayawada: దాడికి పాల్పడిన రౌడీమూక మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గొడవ జరిగిన తరువాత పోలీసులను ఆశ్రయించిన నాగరాజు.. గంజాయి మూక తనను బెదిరించినట్లు తెలిపాడు. అప్పుడే పోలీసులు అప్రమత్తమై ఉంటే ఈ హత్య జరిగేది కాదని రఫీ బంధువులు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా పెనమలూరు తహసీల్దారు ఆఫీసు ఎదుట రఫీ మృతదేహంతో గురువారం ఆందోళన చేశారు. మృతుడు రఫీ తల్లిదండ్రులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. గంజాయి ముఠా చేతిలో రఫీ ప్రాణాలు కోల్పోవడం దారుణం అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి మృతిపై ముస్లిం పెద్దలు, టీడీపీ నేతలు బోడేప్రసాద్, జలీల్‌ఖాన్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అక్కడకు చేరుకోగా మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Doctor Radha Murder Case Update: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు​ సార్​..!'

Chandrababu Phone Call to Muslim Family: రఫీ హత్యపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి 8మందిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కరీముల్లా ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా, అక్రమ్​లతో పాటు మరికొందరి పైనా కేసులు నమోదయ్యాయి. వీరి కోసం 8 ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులందరూ కానూరు, పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని 8 మందిని అదుపులోకి తీసుకొన్నారు.

Constable Murder Case: ప్రియుడి కోసం భర్తను హతమార్చింది.. అనుమానం రాకుండా.. లక్షన్నర పెట్టి..

ABOUT THE AUTHOR

...view details