ఆంధ్రప్రదేశ్

andhra pradesh

30న రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

By

Published : Jul 24, 2021, 11:09 AM IST

11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు / నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్​ల ఎన్నికకూ ప్రకటన వెలువడింది. నేతల ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

Election of Second Deputy Mayor and Vice Chairman on 30th
30న రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక

పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్​ల ఎన్నికకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు.. ఎస్ఈసీఈ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

రెండో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల 30 తేదీన పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఎస్ఈసీ కోరింది. ఈ నెల 25 న ఓట్లు లెక్కించే ఏలూరు నగరపాలక సంస్థకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కె. కన్నబాబు తెలిపారు. ఇక్కడ మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకోవలసి ఉంటుంది. ఎన్నికైన సభ్యులకు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ఈ నెల 26లోగా నోటీసులు ఇవ్వాల్సిందిగా సూచించింది.

ABOUT THE AUTHOR

...view details