ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI Ramakrishna : 'పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు'

By

Published : Aug 15, 2021, 4:10 PM IST

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం (Jagan government) పంచాయతీరాజ్ వ్యవస్థను (panchayathraj system) నిర్వీర్యం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం (Independence day) సందర్భంగా విజయవాడలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు(Flag Hosting). సర్పంచుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఆదేశాలిస్తోందని ఆక్షేపించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయవాడ దాసరి భవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్​లతో కాకుండా పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్​లతో జెండా ఎగరవేయించటం సరికాదన్నారు. సర్పంచుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఆదేశాలిస్తోందని ఆక్షేపించారు. నిధులు, విధులు, అధికారాల విషయంలో చట్ట వ్యతిరేక జీవోలను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details