ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ షురూ.. ధైర్యం వచ్చిందంటున్న పిల్లలు

By

Published : Jan 3, 2022, 11:11 AM IST

Updated : Jan 3, 2022, 12:03 PM IST

Covid Vaccine to Teenagers : రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు టీకాలు అందిస్తున్నారు. ఈనెల 7 వరకు టీనేజర్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక టీకా డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Covid Vaccine to Teenagers
Covid Vaccine to Teenagers

Covid Vaccine to Teenagers : రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు టీకాలు అందిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్​లో అక్కడే ఉంచుతున్నారు. కళ్లు తిరగడం, జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటే మందులు అందజేస్తున్నామని వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికే టీకా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోర్టల్​లో రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా.. ఏపీలో 24 లక్షల మంది మంది పిల్లలు టీకా తీసుకునేందుకు అర్హత కలిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

వార్డు సచివాలయాల్లో ప్రత్యేక టీకా డ్రైవ్‌..

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టీనేజర్లందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందిస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇస్తున్నట్లు వెల్లడించారు. తొలిడోసు స్వీకరించిన 4 వారాల తర్వాత రెండో డోసును అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 7 వరకు టీనేజర్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక టీకా డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

టీకా తీసుకున్నాక ధైర్యం వచ్చింది..

థర్డ్​వేవ్ నేపథ్యంలో తమకు టీకాలు వేయటం ఎంతో సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. ఇప్పటివరకు బయటకు వెళ్లాలంటే భయం భయంగా ఉండేదని.. టీకా తీసుకున్న తర్వాత కొంత ధైర్యం వచ్చిందని విద్యార్థులు తెలిపారు.

యానాంలో సైతం ప్రారంభమైన టీకా డ్రైవ్‌..

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 15-18 ఏళ్ల మధ్య వారికి కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. పుదుచ్చేరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆ ప్రాంత ముఖ్యమంత్రి రంగస్వామి ప్రారంభించిన అనంతరం... తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాంలో విద్యార్థులకు టీకాలు అందిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న టీనేజర్లందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందిస్తున్నట్లు యానాం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి:దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 33,750 మందికి వైరస్​

Last Updated : Jan 3, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details