ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మొక్కజొన్న రైతుకు.. మోయలేని భారం

By

Published : Apr 7, 2020, 12:36 PM IST

Updated : Apr 7, 2020, 3:34 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో రెండో పంటగా సుమారు పదివేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు రైతులు. అకాల వర్షాలు.. వారికి అనుకోని కష్టాలు తెచ్చిపెట్టాయి. తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలన్నారు.

corn farmers facing problems at krishna district
corn farmers facing problems at krishna district

అకాల వర్షాలు.. మొక్కజొన్న రైతుకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. కరోనా ప్రభావంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు.. ఈ వర్షాలు కన్నీళ్లు మిగిల్చాయి. కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, అవనిగడ్డ మండలాల్లో రెండో పంటగా సుమారు పదివేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. అకాల వర్షాలతో దిగబడులు తగ్గిపోయాయి అని రైతులు తెలిపారు. కత్తెర పురుగు నివారణకు ప్రతి 20 రోజులకు ఒక్కసారి పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఒక్కో ఎకరానికి రూ.8 వేలు అదనంగా ఖర్చు అయ్యిందని రైతులు వాపోయారు.

క్వింటా మొక్కజొన్నకు రూ. 1500లు మాత్రమే ధర వస్తోందని రైతులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నెం.52 ప్రకారం... ఏపీ మార్కె ఫెడ్ ద్వారా క్వింటాలు రూ.1760కు కొనుగోలు చేయాల్సి ఉన్నా పట్టించుకునేవారు లేరంటున్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

"ఎకరానికి 30 వేలు పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు ఒక క్వింటాకు రూ. 1500లకు అమ్ముకోవడం వల్ల చాలా నష్టపోతున్నా. ప్రభుత్వమే మా సమస్య తీర్చాలి."

-చిట్టిమోతు నాగమల్లేశ్వర రావు , రైతు

"6 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాను. నాలుగు రోజుల నుంచి దిగుబడి అంతా పొలంలోనే ఉండిపోయింది. తక్కువ రేటుకు అమ్ముకుంటే ఎకరానికి రూ.10వేలు నష్టపోతాము. ప్రభుత్వం స్పందించాలి."

-కోలుసు శ్రీనివాసరావు , రైతు

ఇదీ చదవండి:

దళారుల దోపిడీ.. రొయ్యల ధరల చెల్లింపులో ఇష్టారాజ్యం

Last Updated : Apr 7, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details