ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిన్నారులతో వెళ్తున్న పడవ మునక.. ఒకరు మృతి

By

Published : Aug 4, 2021, 1:07 PM IST

Updated : Aug 4, 2021, 6:46 PM IST

child died
పడవకు ప్రమాదం

13:04 August 04

తొమ్మిది మంది సురక్షితం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పది మంది చిన్నపిల్లలు ఒక్కచోట చేరారు. ఆటలు ఆడటానికి కృష్ణా నది తీరానికి చేరారు. సరదాగా బోటులో తిరిగి వద్దమనుకున్నారు. అంతే అందరూ కలసి పడవలో విహారానికి బయలుదేరారు. నదిలో పడవ కదులుతూ ఉంటే కేరింతలు కొట్టారు. జాలీగా సాగుతున్న వారి ప్రయాణం ఒక్కసారిగా తలకిందులైంది.

చిన్నారులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. అంతే.. అందరూ నీటిలో పడిపోయారు. సాయం కోసం ఒడ్డుకు చూశారు. అక్కడే ఉన్న స్థానికులు ఇందతా గమనించి.. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కొక్కరిని ఒడ్డుకు చేర్చారు. మొత్తం పది మంది చిన్నారుల్లో తొమ్మిది మంది చిన్నారులను స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ దుర్ఘటనలో నడకుదటి సర్వాన్ ఆనంద్(5) నీటిలో మునిగి మృతి చెందాడు. సర్వాన్ ఆనంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

రెచ్చిపోతున్న కుక్కలు..బయటకు వెళ్లాలంటేనే..

Last Updated : Aug 4, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details