ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

By

Published : Feb 20, 2021, 5:48 PM IST

Updated : Feb 20, 2021, 10:59 PM IST

aeroplane
aeroplane

17:46 February 20

గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

 విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దోహా నుంచి గన్నవరం వచ్చిన ఎయిరిండియా విమానం....ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి స్తంభాన్ని తాకింది.

 వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దోహా నుంచి 64మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమాన సర్వీసు గన్నవరానికి చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్‌వే పక్కనున్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. స్తంభం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఈ క్రమంలో  కొద్దిగా శబ్దం కావడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 19 మంది ఏపీ వాసులు..

 64మంది ప్రయాణికుల్లో.. 19మంది ఏపీకి చెందినవాళ్లు. మిగతా 45మంది తమిళనాడులోని తిరుచునాపల్లి వాసులు. వేరే విమానంలో వాళ్ల గమ్యస్థానానికి పంపించారు. విమానం రెక్క పాక్షికంగా ధ్వంసమైంది. పార్కింగ్‌ బేలోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతున్న సమయంలో పొరపాటున రాంగ్‌ టర్న్‌ చేయడమే ఈ ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండీ...విశాఖ - రాయ్‌పూర్‌ మధ్య ఆర్థిక కారిడార్‌కు కేంద్రం ఆమోదం

Last Updated : Feb 20, 2021, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details