ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కన్నుపడితే ఖతమే! - అధికార పార్టీ అండతో కలెక్టరేట్​లో భూ దస్త్రాలు తారుమారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2023, 7:34 PM IST

Updated : Nov 28, 2023, 7:21 PM IST

YCP Leaders Bhu- Kabja In Kakinada District : అధికార నేతల అండతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కంచెలు వేస్తున్నారు. ప్రశ్నించిన యజమానులను బెదిరించి.. తక్కువ ధర ఇచ్చి లాక్కుంటారు. ససేమిరా అంటే దస్త్రాల్లో పేర్లు మార్చేసి ట్యాంపరింగ్ రికార్డులతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కాకినాడలో అధికార పక్ష నేత కనుసన్నల్లో సాగుతున్న భూకబ్జాల పర్వమిది. ఇప్పుడు ఏరంగా కాకినాడ కలెక్టరేట్లోని భూ దస్త్రాల తారుమారుకే తెగబడ్డారు.

ycp_leaders_bhu-kabja_in_kakinada_district
Etv Bharatycp_leaders_bhu-kabja_in_kakinada_district

YCP Leaders Bhu- Kabja In Kakinada District : కాకినాడ సూర్యారావుపేట - చీడీలపొర ప్రాంతంలో 17.80 ఎకరాలను వనరాశి వీర్రాజు, లక్ష్మణ సుబ్బారావుల నుంచి 1851లో ఆంధ్రా బ్యాంకు జప్తు ద్వారా నిర్వహించిన వేలంలో కొప్పుల నాగూరయ్య, చిట్టూరి రామకృష్ణ మూర్తి కొన్నారు. ఇందులో సర్వే నంజర్ 195/3లో రెండెకరాలు క్రయవిక్రయాలు జరిగాయి. నాగూరయ్య కుటుంబీకుల నుంచి చలికి వీరేంద్ర 50 సెంట్లు... గొల్లప్రోలుకు చెందిన రాపర్తి భార్గవ్, అప్పన్న బాన్జీ, సప్తగిరి 32 సెంట్లు కొన్నారు. రాపర్తి మరిడయ్య, గణేష్ కుమారులూ కొంత భూమి కొనుక్కున్నారు. వీరిద్దరూ 2007లో NRI నక్కిన శ్రీనివాసప్రసాద్‌కు 18 సెంట్ల భూమి విక్రయించారు.

Land Kabja : కాకినాడ అర్బన్ తహసీల్దారు కార్యాలయంలోని ఫెయిర్ అడంగల్ రిజిస్టర్, స్కాన్ ఈ రెండెకరాలు ఇప్పటికీ వనరాశి వీర్రాజు, లక్ష్మణ సుబ్బారావు పేరుతో ఉంది. కలెక్టరెట్‌లోని తప్సీ జాబితాలోనూ ఇదే రీతిన ఉన్నా.. అక్కడ రికార్డు రూమ్‌లోని ఆర్ఎస్‌ఆర్ కాపీలో మాత్రం వనవాశి వీర్రాజు పేరు కొట్టేసి, ముమ్ముడి వీర రాఘవులు పేరు రాసేశారు. రెవెన్యూ అధికారుల సహకారం లేనిదే కలక్టరేట్‌లో భూ దస్త్రాలు ఎలా తారుమారు అవుతాయని వాపోతున్నారు.

వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!

'కాకినాడలోనే సర్వే నంబర్ 195/1 లో 91 సెంట్ల భూమి యాజమాన్య హక్కు చల్లా వీరన్న శాస్త్రులు పేరుతో ఉంటే .. ఆయన పేరు సున్నా చుట్టేసి ముమ్మిడి బుల్లప్పన్న పేరు రాశారు. 95/2లో మెట్ట నర్సింహారావు పేరు చుట్టేసి ….. 87 సెంట్ల భూ హక్కుదారుగా ముమ్మిడి అప్పన్న పేరు మార్చారు . ఇలా పలు భూ రికార్డుల్లో పేర్లు మార్చేసి, ట్యాంపరింగ్ చేసి వందల కోట్ల విలువైన భూములను కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. రికార్డులు ట్యాంపరింగ్ చేసి తమ భూములు ఆక్రమించేస్తున్నారంటూ సర్వే నంబర్ 195/3 లోని బాధితులు ఎస్పీ, కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదులు చేసినా నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒత్తిళ్లతో తమకు ఎలాంటి న్యాయం జరగటం లేదు.'- బాధితులు

లోపభూయిష్టంగా జగనన్న భూరక్ష కార్యక్రమం..రీ సర్వేలో తలెత్తిన వివాదాలు

YCP Leaders Land Scam 2023 : కాకినాడకు చెందిన ఓ నేత చీడీలపొర ప్రాంతంలో 20 కోట్ల విలువైన భూమిని సెటిల్మెంట్లో తక్కువ ధరకే చేజిక్కించుకున్నారు. దానిచుట్టూ ఉన్న భూములనూ గ్రావెల్‌తో చదును చేశారు. సర్వే నంబర్ 186/1/1, 198/1/3లో 32 సెంట్ల జిరాయితీ భూమి యజమానులు అప్రమత్తమై పోలీసు అధికారులను ఆశ్రయించారు. 1997లో కొన్న స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్ని స్తున్నారని.. అధికార పక్ష నేత పేరు చెబుతూ, వాహనంతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారంటూ వాపోయారు.

కోట్ల విలువైన భూమిపై ఎమ్మెల్యే కన్ను.. కంచె వేసి..

Last Updated : Nov 28, 2023, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details