Passengers Faced Water Problem : రైలు ప్రయాణం అంటే గంటల తరబడి రైలులోనే కూర్చోని ప్రయాణించాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. రోడ్డు మార్గం కన్నా.. రైలు మార్గం సౌకర్యవంతంగా ఉంటుందని రైళ్లలో ప్రయాణించటానికి ప్రజలు మొగ్గుచూపుతారు. అయితే కాకినాడ నుంచి బయల్దేరిన కాకినాడ - విశాఖపట్నం రైలులో మాత్రం ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రయాణ సమయంలో ట్రైన్లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో నరకయాతను అనుభవించారు.
కాకినాడ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం కాకినాడ నుంచి బయల్దేరింది. అయితే రైలు సరైన టైమ్‌కు అటో ఇటో నడుస్తున్న పట్టించుకొని ప్రయాణికులు.. రైలులో నీళ్లు రాకపోవటంతో ఇబ్బందులు పడ్డారు. చేతులు శుభ్రం చేసుకోవటానికి వాష్ బేసిన్లో నీళ్లు రాలేదని వాపోయారు. అలాగే మరుగుదొడ్లలో సైతం నీళ్లు రాకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నామని అంటున్నారు. నీళ్లు రాకపోవటం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేక దుర్వాసన రావటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించటం సరైంది కాదని వాపోయారు.