ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకినాడలో దంపతుల ఆదృశ్యం.. క్వారీ వద్ద ఓ మృతదేహం..!

By

Published : Dec 8, 2022, 7:54 PM IST

Couple Died: కాకినాడ జిల్లాలోని దంపతులు బహిర్భుమికని బయటకు వెళ్లారు. వారు బయటకు వెళ్లి గంటలు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాలేదు. వారి కోసం స్థానికులు గాలించినా.. ఆచూకీ లభించలేదు. అయితే అదే గ్రామంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన క్వారీ వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం ఎవరిదో తెలియక అందరిలోనూ ఆందోళన మొదలైంది.

Couples Died
దంపతుల మృతి

Couple Died: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలలో బహిర్భూమికి వెళ్లిన దంపతులు ఆదృశ్యమయ్యారు. స్థానికులు వెతికినా వారి ఆచూకీ లభించలేదు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ పైడిపాలకు చెందిన పాలోజు వరహాలు అతని భార్య లక్ష్మీ దుర్గా భవానీ బయటకు వెళ్లారు. వారు సాయత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో.. స్థానికులు వారి ఆచూకీ కోసం వెతికారు. క్వారీ సమీపంలో వీరి ద్విచక్ర వాహనాన్ని స్థానికులు గుర్తించారు.

అక్రమంగా బండరాళ్ల కోసం ఈ క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు వినియోగించేవారు. కొన్ని రోజులుగా ఈ క్వారీ మూతపడి.. ఈ మధ్యనే మళ్లీ తవ్వకాలు చేపట్టారు. ఇదే క్వారీ వద్ద ఓ మృతదేహం లభ్యమైంది. అది ఎవరు అనేది ఇంకా నిర్దారణ కాలేదు. మరోవైపు దంపతుల ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details