ఆంధ్రప్రదేశ్

andhra pradesh

arrested for social media post: సీఎంను చంపుతానంటూ పోస్టు.. జనసేన మద్దతుదారుడు అరెస్ట్

By

Published : Jan 21, 2022, 7:56 PM IST

Updated : Jan 21, 2022, 9:39 PM IST

Youngster arrested for social media post: మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు..సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక తెలిపారు.

youngster arrested for social media post against CM
సీఎంను చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు.. యువకుడు అరెస్టు

Youngster arrested for social media post: మానవబాంబుగా మారి సీఎంను చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన యువకుడిని.. సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సైబర్‌ క్రైం ఎస్పీ రాధిక వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణి.. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 16న ట్విటర్‌లో పెట్టిన పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు తెలిపారు. అయితే, వెంటనే ఆ పోస్టు డిలీట్‌ చేయడంతో పాటు.. నిందితుడు ట్విటర్‌ అకౌంట్‌ మూసేశాడు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశామని..నిందితుడు జనసేన మద్దతుదారుడని ఎస్పీ రాధిక తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఆ వ్యక్తికి మాకు సంబంధం లేదు: జనసేన మీడియా విభాగం

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించమని జనసేన మీడియా విభాగం తెలిపింది. సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అభిమాని ముసుగులో పోస్టులు చేసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని.. వాస్తవ, విశ్లేషణాత్మక, చైతన్యపరిచేలా పోస్టులు ఉండాలని వివరించింది.

ఇదీ చదవండి:

Lovers suicide in Nellore: కలువాయి అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య

Last Updated : Jan 21, 2022, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details