ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. ప్రియుడిని నమ్మి దుబాయి నుంచి వచ్చిన యువతి.. చివరికి

By

Published : Feb 13, 2023, 7:19 PM IST

Cheating in the Name of LOVE : సామాజిక మాధ్యమాల్లో కొత్త పరిచయాలు, స్నేహాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. మోసగాళ్ల వలలో పడి బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మొదటగా పరిచయం చేసుకుని.. క్రమంగా స్నేహం పెంచుకుని ప్రేమ పేరుతో డబ్బు గుంజే వాళ్లు కొందరైతే.. శారీరక వాంఛ తీర్చుకునే వారు మరికొందరు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని హైదరాబాద్​లో జరిగింది.

Cheating in the Name of LOVE
Cheating in the Name of LOVE

Cheating in the Name of LOVE : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రేమగా మారగా.. అది సహజీవనానికి దారి తీసింది. ఇంతలో ఆ యువతికి కుటుంబ సభ్యులు వేరొకరితో పెళ్లి చేసి దుబాయి పంపించారు. మాజీ ప్రియుడి కోరిక మేరకు ఆ యువతి నగరానికి తిరిగొచ్చింది. అయితే తనతో కొన్నాళ్లు ఉండి ముఖం చాటేసి వేరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ బోరబండ రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన యువతి(27) టెలీకాలర్‌గా పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం మహారాష్ట్ర జల్‌గావ్‌కు చెందిన సైఫ్‌(28)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్​కి వచ్చిన సైఫ్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో 2020లో యువతికి ఆమె కుటుంబ సభ్యులు వేరొక సంబంధం చూసి పెళ్లి చేసి దుబాయికి పంపారు. భర్తకు విడాకులిచ్చి రావాలని, తాను పెళ్లి చేసుకుంటానని సైఫ్‌ మళ్లీ మాయమాటలతో మభ్యపెట్టాడు.

ఆ మాటలు నమ్మి దుబాయి నుంచి వచ్చిన యువతి :అది నమ్మి ఆ యువతి భర్తకు విడాకులిచ్చి హైదరాబాద్​కి వచ్చింది. ఆమెకు గర్భస్రావం సైతం చేయించాడు. కొంతకాలం కలిసి ఉండి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈనెల 22న వేరొక యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో బాధితురాలు సైఫ్‌ స్వగ్రామానికి వెళ్లి నిలదీసింది. సైఫ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు యువతిని అంగీకరించకపోవడంతో తిరిగొచ్చి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details