ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ విఫలం: టీడీపీ ఎంపీలు

By

Published : Dec 5, 2022, 5:37 PM IST

TDP MPs FIRES ON CM JAGAN : విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు.

TDP MPS FIRES ON YSRCP GOVERNMENT
TDP MPS FIRES ON YSRCP GOVERNMENT

TDP MPS FIRES ON YSRCP GOVERNMENT : జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. దేశ ప్రతిష్ఠను పెంచేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులపై ప్రస్తావిస్తామని తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖకు ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర సమస్యలపై దిల్లీలో మాట్లాడే హక్కు తమకు ఉందని తెలిపారు. ప్రభుత్వంపై ఏది మాట్లాడినా అక్రమంగా కేసులు పెడుతున్నారని.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలో ఉన్నవాటినీ వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని పార్లమెంటులో దానిని ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్ర హక్కులపై దిల్లీలో ఏం పోరాడారో పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు.

ప్రజల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ నేతలు దిల్లీలో సొంత అజెండా చూసుకుంటున్నారని విమర్శించారు. రాజీనామాలు చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధమన్నారు. కేంద్రంపై పోరాడాలంటే రాజీనామాలు చేయాలని జగనే అన్నారన్న ఎంపీలు.. వైసీపీ నేతలు రాజీనామా చేస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details