ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లోకేశ్‌ యువగళం పాదయాత్రతో ఏపీ ముఖచిత్రం మారబోతోంది: బొండా ఉమా

By

Published : Dec 30, 2022, 4:55 PM IST

BONDA ON CM JAGAN : లోకేశ్‌ యువగళం పాదయాత్రతో ఏపీ ముఖచిత్రం మారబోతోందని టీడీపీ నేత బొండా ఉమ తెలిపారు. కందుకూరు ఘటనపై వైసీపీ నేతలు శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

BONDA ON CM JAGAN
BONDA ON CM JAGAN

BONDA UMA FIRES ON CM JAGAN : టీడీపీ ప్రభంజనం చూసి తాడేపల్లి ప్యాలెస్ వెన్నులో వణుకు మొదలయ్యిందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు ఎద్దేవా చేశారు. మాచర్ల, గుడివాడలో పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు కిరాతకంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్‌ యువగళం పాదయాత్రతో ఏపీ ముఖచిత్రం మారబోతోందని తెలిపారు. విజయవాడలో నారా లోకేశ్​ పాదయాత్రకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

రంగా వర్థంతిని ఏ సామాజిక వర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరు అని ప్రశ్నించారు. విజయవాడలో మసాజ్ పార్లర్లు, సెటిల్ మెంట్ దందాలు చేస్తోంది మీ అవినాష్​ కాదా అని ప్రశ్నించారు. నగరంలో అలజడులకు కారణం దేవినేని అవినాష్ అన్నారు. ఆయన్ను ప్రోత్సహిస్తోంది ముఖ్యమంత్రి జగన్ కాదా అని నిలదీశారు. నాడు రాజశేఖర్ రెడ్డి దేవినేని నెహ్రూను ప్రోత్సహిస్తే... నేడు అవినాష్​ని జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు.

కందుకూరు ఘటనలో పూర్తిగా పోలీసులు వైఫల్యమే కారణమన్నారు. ప్రతిపక్షనేతకు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంలో డీఐజీ వైఫల్యం చెందారన్నారని విమర్శించారు. చంద్రబాబు సభలకు ప్రజలు ఎలా తరలివస్తున్నారో పోలీసులకు తెలియదా అని ప్రశ్నించిన బొండా.. దానికి తగినట్టు భద్రత కల్పించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details