ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆదాయం లేని 'మా' అధ్యక్ష పదవికి రూ.కోట్లు ఖర్చు పెడతారా?: పోసాని

By

Published : Oct 19, 2021, 10:45 PM IST

గుంటూరు జిల్లాలో ఆలయానికి వచ్చిన నటుడు పోసాని మా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్నాయని చెప్పారు.

posani
posani

మా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయని సినీ నటులు పోసాని మురళీకృష్ణ అన్నారు. మా అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలుండవని..కేవలం అది గౌరవం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఇందులో కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారాన్ని పోసాని కొట్టిపారేశారు. అసలు ఎలాంటి ఆదాయం ఉండని అధ్యక్ష పదవి కోసం కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయంలో పోసాని ప్రత్యేక పూజలు చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు తెలుగు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దఎత్తున సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details