ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pawan Kalyan Nadendla Manohar Delhi Tour: దిల్లీకి పవన్ కల్యాణ్, నాదెండ్ల.. బీజేపీ అగ్రనేతలతో భేటీకి ఛాన్స్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 2:37 PM IST

Pawan Kalyan Nadendla Manohar Delhi Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీతో చర్చించిన నేతలు బీజేపీతోనూ చర్చలు కొనసాగించనున్నారు.

Pawan Kalyan Nadendla Manohar Delhi Tour
Pawan Kalyan Nadendla Manohar Delhi Tour

Pawan Kalyan Nadendla Manohar Delhi Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ దిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరిపిన పవన్ కల్యాణ్.. మరోవైపు బీజేపీతోనూ చర్చలు జరుపుతున్నారు.

అదే విధంగా తెలంగాణలో సైతం పోటీకి జనసేన సిద్ధమైన నేపథ్యంలో.. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు జనసేన నిర్ణయించింది. దీంతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.

TDP Janasena: ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వెళ్లేందుకు నిర్ణయించాయి. ఆ దిశగా అడుగులు సైతం వేస్తున్నారు. ఇరు పార్టీల నేతలతో సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. తమతో బీజేపీ కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు గతంలోనే పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details