ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అప్పడు అంగీకరించి.. ఇప్పుడు మూడు రాజధానులు అనడమేంటి?'

By

Published : Jul 19, 2020, 3:59 PM IST

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ తిరస్కరించాలని ఎమ్మెల్సీ రామకృష్ణ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కక్షపూరితమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

mlc ramakrishna on crda and capital bills
mlc ramakrishna on crda and capital bills

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులోని తన నివాసంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, తెదేపా నేత మన్నవ సుబ్బారావు నిరసన దీక్ష చేపట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మూడు రాజధానులు అనడమేంటని.. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానాల అంశాన్ని తెరపైకి తీసుకురావడం కక్షపూరితమైన చర్యని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్​కి పంపిన ఆ రెండు బిల్లులను ఆమోదించొద్దని కోరారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు మానుకోకుంటే... అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details