ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఓటింగ్​

By

Published : Mar 14, 2021, 7:17 PM IST

గుంటూరు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్​ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

guntur teacher municipal elections completed
గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఓటింగ్​

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 177 ఓట్లకు గాను 170 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లాలోని మేడికొండూరు మండలంలో 41 మంది ఉపాధ్యాయ ఓటర్లు పోలింగ్​లో పాల్గొన్నారు. పిరంగిపురం మండలంలో 55 మందికి గాను 54 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాడికొండ మండలంలో 58 మంది ఓటర్లలో ఇద్దరు మినహా మిగిలిన వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. పోలింగ్​ కేంద్రాలకు వంద మీటర్ల దూరం నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై నిషేధం విదించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మంగళగిరిలో ప్రశాంతంగా పూర్తయ్యాయి.

ఇదీ చదవండి:

గుంటూరులో గెలుపుతో అంబరాన్నంటిన వైకాపా సంబరాలు

ABOUT THE AUTHOR

...view details