ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మిర్చి రైతుల ఆశలను చిదిమేసిన లాక్‌డౌన్‌

By

Published : Apr 2, 2020, 7:39 PM IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో పంటను అమ్ముకోలేక మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆసియాలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డును ప్రభుత్వం మూసి వేయటంతో... శీతల గిడ్డంగుల్లో పంటను దాచుకునేందుకు....రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు

mirchi-formers-facing-problems
మిర్చి రైతుల ఆశలను చిదిమేసిన లాక్‌డౌన్‌..దాచుకునేందుకు నిరీక్షణ

మిర్చి రైతుల ఆశలను చిదిమేసిన లాక్‌డౌన్‌..దాచుకునేందుకు నిరీక్షణ

కరోనా మహమ్మారి మిర్చి రైతుల ఆశలను చిదిమేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో తీరా... పంట చేతికొచ్చిన సమయంలో కొనేవారు లేక రైతులు దిగాలుగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీలు దొరకని పరిస్థితిలో పంటను అతికష్టం మీద రైతులే కోసినా.. వాటిని నిల్వ చేయటం తలనొప్పిగా మారింది. ఏటా ఈ సమయంలో పంటను విక్రయించేందుకు... ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల రైతులు పెద్దఎత్తున.. గుంటూరు మిర్చియార్డుకు తరలి వచ్చేవారు. లాక్ డౌన్​తో పంటను అమ్ముకోలేక...శీతల గిడ్డంగుల్లో దాచుకునేందుకు రైతులు తరలివస్తున్నారు.

శీతల గిడ్డంగుల్లో కూలీల కొరత రైతన్నలను వేదనకు గురి చేస్తోంది. అన్‌లోడింగ్‌ కోసం రెండు, మూడు రోజులు ఎదురుచూడాల్సి వస్తోందని... టిక్కీ మిర్చిని 6నెలలు దాచాలంటే 200 రూపాయలు వరకు చెల్లించాలని రైతులు చెబుతున్నారు. దీనికితోడు రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయంటున్నారు. కొన్ని నిబంధనలతో నైనా... గుంటూరు మిర్చియార్డును పాక్షికంగా తెరిచి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details