ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రోగుల సహాయకులకూ త్వరలో 2 పూటలా ఉచిత భోజనం'

By

Published : Jan 26, 2021, 11:24 AM IST

గుంటూరు సర్వజనాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. మాతా, శిశు భవనాన్ని త్వరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Minister Sriranganatharaju
మంత్రి శ్రీరంగనాథరాజు

గుంటూరు సర్వజనాసుపత్రిలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచిత భోజనం అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

దీని కోసం అత్యంత ఆధునిక పద్ధతులతో భోజనశాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి రెండో వారం నాటికి పనులన్నీ పూర్తిచేసి భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మాతా,శిశు భవన నిర్మాణం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details