ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లారీ బోల్తా... ఇద్దరు కూలీలు మృతి

By

Published : May 13, 2021, 4:17 PM IST

గుంటూరు జిల్లా కొల్లూరు గాంధీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి

గుంటూరు జిల్లా కొల్లూరు గాంధీనగర్ వద్ద.. కంకర లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇద్దరు కూలీలు మృతి చెందారు. లారీ అదుపుతప్పి పంట కాలువలో పడిన కారణంగా.. ప్రమాదం జరిగింది. ఘటనలో కూలీలు ఏసుదాసు, దినేష్ అక్కడికక్కడే మరణించారు. కుటుంబ పెద్దలు మృతి చెందటంపై.. ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details