ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వ వైద్యులు

By

Published : Aug 24, 2020, 5:26 PM IST

సహాయ నిరాకరణకు ప్రభుత్వ వైద్యులు సమాయత్తమవుతున్నారు. కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Government doctors preparing for denial of assistance for solve demands
సహాయ నిరాకరణకు సిద్ధమవుతోన్న ప్రభుత్వ వైద్యులు

కొవిడ్ విధులు నిర్వహిస్తున్న వైద్యుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ... సహాయ నిరాకరణకు ప్రభుత్వ వైద్యులు సమాయాత్తమవుతున్నారు. ఈ అంశంపై ఇవాళ విజయవాడలో కార్యాచరణ ప్రకటించారు. కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని... ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జయధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు ఉన్నతాధికారులకు ఈ విషయంపై వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details