ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: మేకతోటి సుచరిత

By

Published : Aug 9, 2020, 3:22 PM IST

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని తలపెట్టిన సందర్భంగా గుంటూరు నగరంలో స్వాతంత్య్ర సమరయోధుడు శివరామకృష్ణయ్యను సన్మానించారు.

felicitate freedom fighters

క్విట్ ఇండియా(ఆగస్టు 9) ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్యను హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే గిరిధర్, కలెక్టర్ ఆనంద్ కుమార్​లు ఘనంగా సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సుచరిత అన్నారు.

ABOUT THE AUTHOR

...view details