ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెళ్లి చేసుకున్నారు... కేసులు పెట్టుకున్నారు..

By

Published : Jul 22, 2019, 10:59 PM IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు ...ఇప్పుడు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇదంతా జరిగింది గుంటూరు జిల్లాలో.

ఎవరిది తప్పు?

ఎవరిది తప్పు?

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వీరయ్య(వినయ్)కు విజయవాడకు చెందిన హారికతో 4 ఏళ్ళ కింద ఫేస్​బుక్​లో పరిచయం అయ్యింది. పరిచయం కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకొని, విజయవాడలో కాపురం పెట్టారు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి కాపురం తరువాత గొడవలు మెుదలయ్యాయి.
తనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, వినయ్​కు అంతకు ముందే పెళ్లి అయిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది హారిక. ఇదేంటని ప్రశ్నించినందకు వినయ్ చిత్రహింసలు పెడుతున్నాడని ఆరోపించింది. ప్రస్తుతం తనకు ఎవరూ లేరని, తనకు న్యాయం చేయాలని గుంటూరు ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఈ విషయంపై స్పందించిన వినయ్ హరితే తనను మోసం చేసిందని చెప్తున్నాడు. తన ఆస్తులపై కన్నేసి తనన పెళ్ళి చేసుకుందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని బాధితుడు ఆరోపించాడు.

ABOUT THE AUTHOR

...view details