ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చిరునవ్వులతో ఇంటికి పంపడమే మా లక్ష్యం'

By

Published : May 12, 2021, 6:14 PM IST

కొవిడ్​పై పోరాటంలో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతూ.. రోగుల బాగు కోసం ఎంతో మంది నర్సులు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. రేయింబవళ్లు చెప్పలేని ఒత్తిడితో సతమతమవుతున్నా.. కార్యదక్షతను మాత్రం వీడటం లేదు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గుంటూరు జీజీహెచ్​లో పనిచేస్తున్న సేవా మూర్తులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ఫేస్​ టు ఫేస్.

Guntur ggh hospital nurses
గుంటూరు జీజీహెచ్ నర్సులతో ఇంటర్వూ

గుంటూరు జీజీహెచ్​లో నర్సులతో ఫేస్​టుఫేస్

కొవిడ్ వైరస్​పై వారిది అలుపెరుగని పోరాటం. విరామం ఇవ్వని నిస్వార్థ సేవ. విధుల్లో వారి అంకితభావం నిరుపమానం. కరోనాపై పోరాటంలో వైద్యులతోపాటు నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న సేవలు.. రోగుల ప్రశంసలు పొందుతున్నారు.

రేయింబవళ్లు చెప్పలేని ఒత్తిడితో సతమతమవుతున్నా.. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నా.. వారి కార్యదక్షతను మాత్రం వీడటం లేదు. నిరంతకరం రోగుల బాగోగులు చూసుకుంటూ వారి ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ ఇంటికి పంపడమే తమ లక్ష్యమంటున్న గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి నర్సులతో.. మా ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details