ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలోని గ్రానైట్ కంపెనీల సోదాలపై ఈడీ ప్రకటన.. ఆ రికార్డులు స్వాధీనం

By

Published : Nov 11, 2022, 3:04 PM IST

ED raids in telangana Updates: తెలంగాణ రాష్ట్రంలోని గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈడీ ఎదుట హాజరైన గ్రానైట్ కంపెనీ యజమాని పాలకుర్తి శ్రీధర్ విచారణ ముగిసింది. రెండు రోజుల క్రితం పలు గ్రానైట్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ED raids in telangana
ED raids in telangana

ED raids in telangana Updates: తెలంగాణ రాష్ట్రంలోని గ్రానైట్‌ కంపెనీలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈడీ ఎదుట హాజరైన గ్రానైట్ కంపెనీ యజమాని పాలకుర్తి శ్రీధర్ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు రావాలని ఆయనకు తెలిపారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. రెండు రోజుల క్రితం పలు గ్రానైట్ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే పలు గ్రానైట్ కంపెనీల యజమానులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ప్రకటన విడుదల..: ఈ సందర్భంగా గ్రానైట్ కంపెనీల సోదాలపై ఈడీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, ఎస్‌జీపీ ప్రైవేట్ లిమిటెడ్‌, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన ఈడీ.. 10 ఏళ్లలో ఎగుమతులకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

అసలేం జరిగిదంటే:రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు జరిగాయి. ఓవైపు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు, విచారణ కొనసాగుతుండగానే.. తాజాగా కొన్ని గ్రానైట్‌ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌ రావు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్​జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మంలోని గ్రానైట్‌ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని.. పీఎస్​ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని.. ఎస్​వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details